ముందు   మనం మహాభారతానికి మరియు మన దేశం కి పేరు ఎలాగ వచ్చిందో చూద్దాం 
               
విశ్వామిత్రుడు: మన అందరికీ విశ్వామిత్రుడు ఒక ఋషి లాగ తెలుసు కానీ విశ్వామిత్రుడు ఒక రాజు తన అహంకారాన్ని వదిలి తపస్సుకు వెళ్తాడు అది చూసే దేవేంద్రుడు వజ్రాయుధుడు అయినా ఇంద్రుడు తన పదవిపోతుంది అని ఇంద్ర లోకంలో ఒక అందమైన అప్సరస అయినా మేనకను విశ్వామిత్రుడు వద్దకు తపస్సు భంగం కోసం పంపుతాడు . అపుడు విశ్వామిత్రుడు మేనక అందానికి తన తపస్సు విడిచి పెట్టారు
విశ్వామిత్రుడు మేనక కలయిక సమయంలో జన్మించిన ఒక ఆడపిల్ల శకుంతలాదేవి కానీ మేనక తీసుకుని వెళ్తే ఇంద్ర లోకం లోకి ప్రవేశం వుండదు అని ఆ కుమార్తెని అడివి లో ఉంచి ఇంద్ర లోకంలో కి వెళ్తుంది . అపుడు ఆ శిశువు యొక్క ఏడుపు ను దూర్వాసుడు విని ఆ శిశువుకు  శకుంతలదేవీ అనీ నామకరణం చేసాడు ఒక రోజు ఒక రాజు వేటకు వెళ్ళి అక్కడ ఆ స్త్రీ నీ చూసి వివాహం చేసుకోవాలి అనీ అనుకుంటాడు అప్పుడు ఆ రాజు ఆమెను అడుగుతాడు .తను తన తండ్రి ఇష్టం అని పలుకుతుంది  తన తండ్రి ఆ రాజు కి శకుంతలదేవి జనన రహస్యం తెలియచేసాడు అపుడు ఆ రాజు తన ఉంగరం తనకి పెట్టి గంధర్వవివహం చేసుకుంటాడు రాజు అక్కడనుంచి వెళ్లిపోతాడు .
కానీ కొన్ని రోజులకీ వారికి ఒక పుత్ర సంతానం కలుగుతుంది అపుడు తన తండ్రి తన శిష్యులు తో పాటు తన కూతురి ,మరియు ఆ శిశువును తీసుకుని వెళ్తాడు ప్రయాణం మధ్యలో నీటిలో తన వివాహ ఉంగరం జారిపోతుంది అప్పుడు దుశ్యంత మహారాజు తనను అంగీకరించలేదు అప్పుడు తను అనేక విథాలుగా కృషి చేస్తుంది అపుడు ఆకాశవాణి ద్వారా ఓ రాజా ఆ పుత్రుడు నీ పుత్రుడే అని పలుకుతుంది అపుడు రాజు తనుకు తెలుసు అని చెబుతాడు తను లోకం గురించి ఇలా చేశాను అని చెపుతాడు 
తన పుత్రుడు చిన్నతనంలో వున్నపుడు పులులతో ఆడుకున్నాడు అందుకే భరతుడు అని నామకరణం చేశారు ఆ భరతుడు పాలించిన రాజ్యం కాబట్టి భారత దేశంలో  అయింది అందుకే  ఈ కథకు మహా భారతం అని పేరు వచ్చింది !!
                                            ద్రోణ✍️

Comments

Anonymous said…
😊

Popular posts from this blog

శ్రీమతే హయగ్రీవాయ నమః

అమృతం డైలీ సీరియల్

cinema