శ్రీమతే హయగ్రీవాయ నమః
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే|| శ్రీ మహా విష్ణువు దశవతారాలో ఒక అవతరం హయగ్రీవ అవతారము హయగ్రీవ అవతారము ఏ విధంగా ఉద్భవించింది? శ్రీ మహా విష్ణువు తన కుమారుడు అయిన బ్రహ్మ కి వేదములను ఉపదేశించిన తరువాత సృష్టి ప్రారంభమయ్యింది ఒక రోజు ఇద్దరు రాక్షసులు అయిన మధు మరియు కైటబులు బ్రహ్మ వద్ద ఉన్న వేదములును అపహరించి సముద్రములోకి వెళ్లారు బ్రహ్మ సృష్టి చేయాలి అంటే వేదలు ప్రధానం కాబట్టి బ్రహ్మ తన తండ్రి అయిన విష్ణువు వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం వివరిచిన తరువాత బ్రహ్మ కోరిక మేరకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారము దాల్చి సముద్రము లో కి వెళ్ళి వారితో యుద్ధము చేసి వారికి మోక్షం కలిగించి వేదములు తీసికొనివచ్చి బ్రహ్మ కి మరల ఉపదేసించి సృష్టి ప్రారంభమం చేశాడు కానుక శ్రావణ పూర్ణిమ నాడు అందరూ ఉపాకర్మ చేసుకుంటారు ఉపాకర్మ ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి? ఉపాకర్మ అనేది యజ్ఞోపవీతం ఉన్న ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే సృష్టి పునః ప్రారంభం అవుతుంది కాబట్టి ఉపాకర్మ అనేది చేసుకోవాలి. ఈ ఉపాకర్మ చేసుకోవడం వల్ల మనం ఆ సంత్సరకాలంలో చేసిన పాపలకు ప్రాయశ్...